జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ఖమ్మం జిల్లా ఫిబ్రవరి 21. ఖమ్మం జిల్లాలోని శ్రీ చైత న్య జూనియర్ కళాశాలలో ఈరోజు విషాదం నెలకొంది, ఇంటర్ ఫస్టియర్ చదువు తున్న విద్యార్థిని డేగల యోగానందిని (17) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది,

తన హాస్టల్ గదిలోనే ఉరి వేసుకున్నట్లు తెలుస్తుంది.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయి నట్లు వైద్యులు నిర్ధారించా రు. ఆమె స్వస్థలం ఏపీ లోని అల్లూరి జిల్లా ఏట పాక గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

కాగా విద్యార్థిని ఆత్మహ త్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలసుకున్న విద్యార్థి సంఘాలు హాస్పిటల్‌ వద్ద ఆందోళన చేపట్టారు…

ఆమె కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘట నపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

student suicide

You cannot copy content of this page