ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Thalliki Vandanam

▪️ఆగస్టు 3 వరకు ఫిర్యాదుల స్వీకరణ
▪️అర్హత కోల్పోయిన వారి నుంచి అభ్యంతరాలు
▪️రెండో విడతలో 30న తల్లుల ఖాతాలో నిధుల జమ

Thalliki Vandanam : త్రినేత్రం న్యూస్ : తల్లికి వందనం పథకంలో అర్హులైనా ఆర్థిక సాయం అందని విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అర్హులు, అనర్హుల జాబితాలను స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

అందిన ఫిర్యాదులను ఆగస్టు 4 నుంచి 10 వరకు పరిశీలించి, అదనపు అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. మొదటి విడతలో ఆర్థిక సాయం అందని వారు, అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా అర్హులుగా గుర్తించిన విద్యా ర్థులతో పాటు ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్లో తాజాగా చేరిన విద్యా ర్థుల జాబి తాలను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు.

అదే రోజు అర్హు లైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్లో కొత్తగా చేరే విద్యార్థుల ప్రవేశాలకు ఆగస్టు 25 వరకు గడువు నిర్ణయించారు. ఆ లోపు ప్రవేశాలు పూర్తి చేసుకున్న వారు అవసరమైన పత్రాలతో సంబంధిత స్వర్ణ కార్యాలయాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page