అగ్నిప్రమాద ప్రాంతాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజక వర్గం బిక్కవోలు మండలం,త్రినేత్రం న్యూస్
పందలపాకలో షార్ట్ సర్క్యూట్ వలన కనూరి శంకర్ రావు, చెందిన బరకాల గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించడం, మంటలు వేగంగా చెలరేగడంతో గోడౌన్ పాక్షికంగా దగ్ధమైంది.అదే గ్రామ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే నల్లమిల్లి విషయం తెలుసుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితుని పరామర్శించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు.సుమారు రూ.5 లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,కి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గ ఎన్ డి ఏ నాయకులు,బిక్కవోలు మండల ఎన్ డి ఏ నాయకులు, పందలపాక గ్రామ ఎన్ డి ఏ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App