TRINETHRAM NEWS

మద్యం మత్తులో యువకుల వీరంగం ఆర్టీసీ డ్రైవర్, మహిళా కండక్టర్ పై దాడి

కరీంనగర్ ఉమ్మడి జిల్లా పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు ఆర్టీసీ డ్రైవర్ మహిళ కండక్టర్ పై దాడికి దిగారు. ఈ ఘటన బేగం పేట్ సమీపంలోని సెంటినరీ కాలనీలో చేసుకుంది, మద్యం మత్తులో ఆర్టీసీ మహిళా కండక్టర్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై, పోలీసులు కేసు నమోదు చేశారు

పెద్దపల్లి నుండి మంథని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 9గంటల కు తెంలగాణ చౌరస్తా, సెంటినరి కాలనీకి చేరింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారును ర్యాష్ గా నడుపుకుంటూ వచ్చి బస్సుకు అడ్డంగా పెట్టారు.

కారును పక్కకు తీయాలని బస్సు డ్రైవర్ అడగడంతో అతనితో వాగ్వాదానికిది అడ్డుగా వెళ్లిన కండక్టర్ పై దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యానికి దిగారు. అసభ్య పదజాలంతో మాట్లాడారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు.

ఆర్టీసీ మహిళా కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన రాచకొండ రవి, మోతె రాజయ్యలపై కేసు ఫైల్ చేశారు.

ఈ సందర్బంగా ఎస్ఐ చంద్ర కుమార్ మాట్లాడు తూ ఎవరైనా చట్ట వ్యతి రేక చర్యలకు పాల్పడినట్ల యితే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

attacked RTC driver