దేశానికి అంబేద్కర్ అద్భుతమైన సేవలు అందించారు ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ
పెద్దపల్లి, డిసెంబర్ -06: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భారత దేశానికి డా.బి.ఆర్. అంబేడ్కర్ అద్భుతమైన సేవలు అందించారని ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ తెలిపారు.
శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ పూల మాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి అంబేడ్కర్ చేసిన సేవలను కొనియాడారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగం, మహిళలకు ఓటు హక్కు, ఎస్సి, ఎస్టీ వర్గాల వారికి న్యాయం చేసేలా చట్టబద్దమైన రిజర్వేషన్ వంటి అనేక పనులను చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రామిల్ల బాపు దళిత లిబరేషన్ ఫ్రంట్ జిల్లా కన్వీనర్ ఈర్ల సురేందర్ ఎక్స్ ఎంపిటిసి పెరిక రాజేశం అంబేద్కర్ సంఘ ప్రధాన కార్యదర్శి జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ బి వెంకటేశం జూనియర్ అసిస్టెంట్ జే. రాజశేఖర్ వసతి గృహ సంక్షేమ అధికారులు కే శ్రీనివాస్ ఎస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App