
- అంబేద్కర్ గురించి ఈతరం… భవిష్యత్తు తరం తెలుసుకోవాలి
- అందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం
- దళితులు కారు డ్రైవర్లుగా కాదు ఓనర్లు కావాలి
- అందుకే కూటమి ప్రభుత్వం వారికి రుణాలు ఇస్తోంది
- ఈసారి కూటమి ప్రభుత్వం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తోంది
- అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
- ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సొంత నిధులు రూ.3 లక్షలతో అంబేద్కర్ నగర్, రామదాసుపేటలో విగ్రహాలు ఏర్పాటు
Trinethram News : రాజమహేంద్రవరం :
రాజ్యాంగం రూపంలో అంబేద్కర్ మహాశయుడు మనతోనే ఉన్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా తన సొంత నిధులు రూ. 3 లక్షలతో 13వ వార్డు అంబేద్కర్ నగర్, 46 వ డివిజన్ రామదాసు పేటలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాలను సోమవారం ఆయన ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా కూటమి ప్రభుత్వం అధికారికంగా గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం బలం నిరూపించుకోవడానికి కాదని అంబేద్కర్ గొప్పదనం గురించి ఈతరం, భవిష్యత్తు తరాలు తెలుసుకునేందుకని పేర్కొన్నారు. ఆయనను ఎందుకు కొలుస్తున్నాము, ఎందుకు జయంతి వర్థంతి చేస్తున్నాం, ఆయన ప్రాముఖ్యత ఏమిటనేది అందరికీ తెలియాలని ఆయన అన్నారు. ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామన్నా,కులమతరహిత సమాజం కోసం కృషి చేస్తూ ఉన్నామన్నా, ఇన్ని కులాలు సఖ్యతగా జీవిస్తున్నా మన్నా అందుకు రాజ్యాంగం కారణమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ ను దైవంగా భావించాలని ఈతరమే కాదు, భవిష్యత్తు తరాలు కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను గుర్తుపెట్టుఉంటాయని ఆయన అన్నారు.
ఆయన స్ఫూర్తితో అందరు ముందుగా వెళదామని చెప్పారు. గత ఐదేళ్ళు వైసీపీ పాలనలో దళితులపై దాడులు, శిరోముండనాలు, చంపి డోరు డెలివరీ చేయడం , వేధింపులు చూశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. దళితులను ఆర్థికంగా ఆదుకోవడం కాని, ప్రోత్సాహించడం కాని జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది అంబేద్కర్ జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారధ్యంలో దళితులకు రుణాలు ఇస్తున్నారని, ఎస్సీ లోన్లు ప్రారంభించు కుంటున్నామని, దళితులంటే కారు డ్రైవర్లు కాదు, ఓనర్లనే ఆలోచనతో ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటున్నామని, ముందుగా అసమానతలు తొలగాలని, దళితులు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని, తాము కూడా డబ్బు సంపాదించుకోగలమనేభావన వారిలో రావాలని కూటమి ప్రభుత్వం ఎస్సీ లోన్లు ఇస్తోందని ఆయన చెప్పారు.
గత ఐదేళ్ళు జగన్ పాలనలో ఒక్క లోను అయినా ఇచ్చారా, దళిత డ్రైవరును చంపి డోరు డెలివరీ చేసిన ఎమ్మెల్సీ వ్యక్తి పదవిని రద్దు చేయగలిగారా లేదే అని విమర్శించారు. కాని తమ కూటమి ప్రభుత్వంలో కావలి గ్రీష్మ కు ఎమ్మెల్సీ ఇచ్చామని ధైర్యంగాచెప్పగలుగుతున్నామని ఆయన అన్నారు. గత ఐదేళ్ళు వైసీపీ వారు అంబేద్కర్ జయంతి అంటే తూతూ మంత్రంగా, నామమాత్రంగా చేసి వెళ్ళి పోయేవారని,ఈ ఏడాది కూటమి ప్రభుత్వం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారికంగా, అంగరంగ వైభవంగా అంబేద్కర్ జయంతిని చేస్తోందని, గౌరవిస్తోందని, ఇందుకు కారకులైన అధికారులందరని అభినందిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. కాగా గోకవరం బస్టాండ్ నుంచి భారీ కారు ర్యాలీగా అంబేద్కర్ నగర్, రామదాసు పేట చేరుకుని ఆయా ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఆవిష్కరించారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ పర్యవేక్షణలో నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చిన్న రాజు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, రెడ్డి మణేశ్వరరావు, బుడ్డిగ రాధా, కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, రుంకాని విజయ్, మరుకుర్తి రవి యాదవ్, అగురు ధన్ రాజ్, దుత్తరపు గంగాధర్, కప్పల వెలుగు కుమారి, బొర్రా చిన్ని, ద్వారా పార్వతి సుందరి, కోసూరి చండిప్రియ, కేబుల్ మురళి, బంగారు నాగేశ్వరరావు, దాస్యం ప్రసాద్, చెల్లుబోయిన సూర్య నారాయణ మూర్తి, చింతపల్లి నాని, బోను ఈశ్వరి, గొర్రెల రమణి, ఈతలపాటి రవి, బేసరి చిన్ని, కవులూరి వెంకట రావు, సలాది ఆనంద్, నగరబోయిన రామకృష్ణ, రాయి అప్పన్న బాబు, కర్ణం లక్ష్మీ నాయుడు, మోతా నాగలక్ష్మి, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
