
-అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తిసూర్యనారాయణ రెడ్డి,
- అనపర్తిలో ఘనంగా బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
త్రినేత్రం న్యూస్:అనపర్తి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కేవలం బడుగు బలహీన వర్గాల వ్యక్తే కాదని, భారతదేశ భావి తరాలకు ఒక శక్తి అని అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనపర్తి పాత ఊరిలోని నల్ల కాలువ దగ్గర పాత పేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ దేశాలతో కొనియాడబడిన వ్యక్తి బి.ఆర్ అంబేద్కర్ అని, అంబేద్కర్ ఆశయాలు భావి భారత తరాలకు మార్గదర్శకాలని పేర్కొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటే కేవలం బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదని భవిష్యత్తు భారత తరాలకు ఆయన ఒక శక్తి అని,అంబేద్కర్ అసమానత మరియు కుల ఆధారిత పక్షపాతానికి వ్యతిరేకంగా సాహసోపేతమైన పోరాటం చేశారని, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా అందరి పౌరులకు సామాజిక న్యాయం, సమానత్వం మరియు ప్రాథమిక హక్కులు ఉండేలా చూసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు.
అంబేద్కర్ భావం భావితరాలకు దిక్సూచి అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తిసూర్యనారాయణ రెడ్డి, కొనియాడారు.
వారితో పాటు వారాకుమారి (అనపర్తి గ్రామ సర్పంచ్) , సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి (జడ్పిటిసి సభ్యులు) , సబ్బెళ్ళ కృష్ణారెడ్డి (అనపర్తి వ్యవసాయ కమిటీ మాజీ ఛైర్మన్) , కాశీ డేవిడ్ రాజు (వార్డు సభ్యులు) , కొండేటి భీమేష్ (బీసీ సెల్ అధ్యక్షులు) , పోతుల ప్రసాద్ రెడ్డి (బుజ్జి గారు) (బిక్కవోలు మండల కన్వీనర్), సత్తి పోతారెడ్డి, వాసంశెట్టి కోటేశ్వరరావు (వార్డు సభ్యులు) , నందికొల్ల రవికుమార్, తిరగట్టి శివ ,కొమ్మరి అబ్రహం ,సత్యనారాయణ రెడ్డి తదితరులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
