జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 10 at 4.40.20 PM

TRINETHRAM NEWS

Trinethram News : జనసేనలోకి అంబటి రాయుడు?

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారు. టికెట్‌పై వైసీపీ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు జనసేనలో చేరే అవకాశం ఉంది.

గతేడాది డిసెంబర్ 26వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో అంబటి రాయుడు వైసీపీలో చేరారు. గుంటూరులో వైసీపీ నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’కు ఆయనను అంబాసిడర్‌గా నియమించింది. గుంటూరు నుంచి ఎంపీ టికెట్ ఆశించారు అంబటి రాయుడు. అయితే, వైసీపీలో సర్వేల ఆధారంగా టికెట్ల విషయంలో కఠినంగా ఉంటున్న వైఎస్ జగన్ గుంటూరు టికెట్ అంబటి రాయుడికి ఇవ్వలేమన్న సమాచారంతో రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ కావడంతో అంబటి రాయుడు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.

You cannot copy content of this page