Alumni Reunion : నారాయణ గిరిలో పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జులై 29: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరగింది.ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో వల్లపురెడ్డి నరేందర్ రెడ్డి, గడ్డం రాజయ్య, బెల్లం రాజయ్య,కోటిలింగం, లింగారావు, కర్ర సురేందర్ రెడ్డి, వక్కల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.పూర్వ విద్యార్థులు తమ విద్యార్థి దశ జ్ఞాపకాలను, ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞతలు, తాము సాధించిన విజయాలను పంచుకున్నారు. మరణించిన మిత్రులను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధా కిషన్, రాధాకిషన్ రావు, స్నేహలతా రెడ్డి, రమా జ్యోతి తదితరులు హాజరై విద్యార్థుల అభినందనలు అందుకున్నారు. 1989లో స్కూల్‌కి వచ్చిన ఉత్తమ పాఠశాల అవార్డు గురించి గుర్తు చేశారు.ఈ కార్యక్రమం విద్యార్థుల మధ్య స్నేహబంధం ఎంత విలువైనదో చాటిచెప్పింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Alumni reunion at Narayanagiri

You cannot copy content of this page

Scroll to Top