TRINETHRAM NEWS

Allotment of mobile numbers to Blue Clots and Petro car staff Godavarikhani ACP Ramesh

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లూ మరియు పెట్రో కార్ డ్యూటీ చేస్తున్న సిబ్బందికి పర్మినెంట్గా మొబైల్ నెంబర్లు ఉండాలని ఉద్దేశంతో పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి ) పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్., ఆదేశాలతో గోదావరిఖని ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మొబైల్ నంబర్స్ కేటాయించడం జరిగింది.

ఈ ఫోన్ నెంబర్లతో డ్యూటీలో ఏ సిబ్బంది ఉన్న ఈ ఫోన్ నెంబర్స్ అట్టి బ్లూ క్లోట్స్ , పెట్రో కార్ సిబ్బదికి పర్మినెంట్ గా ఉంటాయి. ఇది ప్రజలు గమనించాలి.

అదేవిధంగా ఈరోజు బ్లూ కోర్టు సిబ్బందికి నైట్ టైం లో గస్తీ నిర్వహిస్తున్నప్పుడు చీకటి ప్రదేశంలో కూడా గస్తి నిర్వహించే విధంగా వారికి టార్చిలైట్లు ఇవ్వడం జరిగింది.

రాత్రి వేళలో తిరుగుతున్నప్పుడు లాఠీలు కూడా క్యారీ చేయాలని ఏసిపి సూచించడం జరిగింది.

ఈ వర్షాకాలంలో సిబ్బంది యొక్క మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు dial100 ఫోన్లు వర్షానికి పాడవకుండా సిబ్బందికి బ్యాగులు కూడా ఇవ్వడం జరిగినది.

ఇట్టి సంబంధిత వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ సెక్యూరిటీ కల్పిస్తూ డ్యూటీ నిర్వహించాలని ఏసిపి బ్లూ క్లోట్స్ సిబ్బందికి, పెట్రో కార్ సిబ్బందికి మరియు వన్ టౌన్ పోలీస్ అధికారులు అందరికీ సూచించడం జరిగింది

ఇట్టి కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Allotment of mobile numbers to Blue Clots and Petro car staff Godavarikhani ACP Ramesh