ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Allocation of Funds

Allocation of Funds : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 26 ; పిఠాపురం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఆధ్యాత్మిక క్షేత్రం ఆ పిఠాపురంలో అభివృద్ధి పనులకు వేగం పెరగనుంది. ఇందుకుగాను 30.66 కోట్ల నిధులు కేటాయించారు.

26 దేవాలయాల పునరుద్ధరణకు రూపాయలు 17.06 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నిర్మాణానికి రూపాయలు 2 కోట్లు, అదేవిధంగా 48 భజన మందిరాల అభివృద్ధికి రూపాయలు 11.60 కోట్లు కేటాయించడం జరిగింది. అక్కడకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు మెరుగైనటువంటి వసతులు కల్పించడంతోపాటు ఆలయాలు మరియు భజన మందిరాలను ఆధునికరించేలా ఈ పనులు చేపట్టనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page