జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ఆర్థిక సాయంతో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వ్యాపారాలు చేయాలని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మేనేజర్ గురు దేవి అన్నారు. మోమిన్ పేట్ ఐకెపి స్త్రీ శక్తీ భవన్ లో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ అధ్వర్యంలో దివ్యాంగులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వికారాబాద్ జిల్లాలోని చిన్న, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలైన దివ్యాంగులను గుర్తించి, వారికి వారి ప్రతిభకు తగ్గట్టుగా వారు చేస్తున్న వ్యాపారాలను బలోపేతం చేస్తూ మెరుగైన జీవనోపాధిని పొందడానికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

అర్హులైన దివ్యాంగులకు వారి వ్యాపారాలకు అవసరమయ్యే వస్తువులను ఇప్పించ నున్నట్లు తెలిపారు. మోమిన్ పెట్ మండలములో 25 మందికి ఇచ్చారు. ప్రతి నిరుపేద దివ్యాంగుల్ని గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ రామేశ్వర్, లబ్దిదారులు అయ్యుబ్ ఖాన్, మంజుల, చిరంజీవి, అప్సన బేగం, రషీద్, సువర్ణ, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

All the disabled should

You cannot copy content of this page