All people should contribute to the development of Pedpadalli town
జెండాలు, కండువాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం..
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి పట్టణాన్ని సుందరమైన పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని అలాగే అధికారులు పకడ్బందీగా పని చేయాలని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు తెలిపారు.
పెద్దపల్లి పట్టణంలోని 08 మరియు 09 వ వార్డుల్లో శుక్రవారం రోజున ఉదయం స్థానిక కౌన్సిలర్లు బొంకూరి బాగ్యలక్ష్మి సురేందర్ సన్నీ, ఎరుకల కల్పన రమేష్ తో మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా వార్డులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లు మరియు కాలువలు, డ్రైనేజీలలో చెత్తను పడవేయకుండ ఉండాలని వార్డు ప్రజలను ఎమ్మెల్యే కోరారు. డ్రైనేజీ మరియు ఓపెన్ లాండ్ లోని చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బంది వారికి అదేశించారు.
ఈరోజు పర్యటించిన ఎనిమిది మరియు తొమ్మిదవ వార్డులలో రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అతి త్వరలో నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా 30 కోట్ల రూపాయలను మంజూరు చేశామని అనంతరం వార్డులలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలను నాటారు. అలాగే వార్డుల ప్రజలకు ఇంటింటా తిరిగి మొక్కలను పంపిణీ చేశారు.
పెద్దపల్లి పట్టణంలోని 8 & 9వ వార్డులలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పర్యటించడం జరిగిందని అలాగే వార్డుల ప్రజలు తమ సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగిందని అతి త్వరలో తమ తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు అడిగిన విధంగా పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మాణం చేపడతామని తెలియజేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చూసుకుంటామని అన్నారు. వార్డులో ఉన్న ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి మరియు కౌన్సిలర్లు దృష్టికి తీసుకురావాలని వాటిని మేము వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎ. ఈ సతీష్, మున్సిపల్ మేనేజర్ శివ ప్రసాద్, పట్టణ కౌన్సిలర్లు, ప్రభుత్వ అధికారులు, ఎ.ఎన్.ఎం లు, ఆశా వర్కర్లు, విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డుల ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App