Albendazole medicines for healthy children Additional Collector of Local Bodies J. Aruna
పెద్దపల్లి , జూన్ -20: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ మందులు వేయించి, వారికి నులిపురుగుల నుండి రక్షణ పొందాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ అన్నారు.
గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ప్రగతి నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు ) లో నిర్వహించిన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డితో కలిసి పాల్గొని మందుల పంపిణీని కార్యక్రమాన్ని ప్రారంభించి, పాఠశాలలో చదివే విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులు అందించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, నులి పురుగులు మన శరీరంలో ఉండటం వల్ల మనం తీసుకునే ఆహారంలో పోషకాలను గ్రహిస్తాయని, దీని వల్ల అనీమియా, రక్త స్రావం, ఎదుగుదల సరిగా లేకపోవడం జరుగుతాయని, వీటి నివారణకు తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మందులు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని, ఏజ్ గ్రూప్ వారిగా నిర్దేశిత మందుల డోస్ ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు.
జిల్లాలోని 1 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న 2,27,251 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. నులి పురుగుల నివారణ కోసం జిల్లాలో బఫర్ స్టాక్ తో కలిపి మొత్తం 2,49,976 ఆల్బెండజోల్ మాత్రలు సిద్ధం చేశామని ఆమె పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలు, అంగన్ వాడి కేంద్రాలలో, ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలో, జూనియర్ కళాశాలలో, సాంకేతిక కళాశాలలో మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. నేడు నులి పురుగుల నివారణ మాత్రలు తీసుకొని విద్యార్థులకు జూన్ 27న మరో మారు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
వ్యక్తిగత పారిశుద్యం పట్ల ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించాలని, ఆహారం తీసుకునే ముందు, టాయిలెట్ వినియోగించిన తరువాత తప్పనిసరిగా చేతులు కడుక్కొవాలని అదనపు కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.
పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు తీసుకొని నులిపురుగుల బారి నుండి రక్షణ పొంది ఎనీమియా, తదితర జబ్బులు రాకుండా మానసిక, శారీరకంగా ఆరొగ్యంగా ఉంటూ అన్ని రంగాలలో అభివృద్ది సాధించాలని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి మాట్లాడుతూ,ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మందులను తీసుకోవాలని అన్నారు. పిల్లలు చిన్నతనం నుంచే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని మున్సిపల్ చైర్ పర్సన్ కోరారు.
నులి పురుగుల నివారణ మందుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచి పౌష్టికాహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్ అలవాట్లు మానుకోవాలని అన్నారు. పాఠశాలలో అందించే రాగి జావ, మధ్యాహ్న భోజనంలో అందించే గుడ్లు మంచి పౌష్టికాహారమని , వీటిని విద్యార్థులు తప్పనిసరిగా రెగ్యులర్ గా తిన్నాలని అన్నారు.
నులిపురుగుల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరు సద్వినియోగం చేసుకోవాలని, తప్పని సరిగా 19 సంవత్సారాలలోపు వయస్సు కల్గిన ప్రతి ఒక్కరు నివారణ మందులు వేసుకోవాలని, ఈ రోజు మిస్సైన వారి కోసం జూన్ 27న మరోమారు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
నులిపురుగుల నివారణ మందులు తీసుకోవడంతో పాటు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మనం మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె విద్యార్థినులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమీషనర్ వెంకటేష్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రంగారెడ్డి, జిల్లా మైనార్టీ అధికారి మేరాజ్ మహ్ముద్, ఎం ఈ ఓ సురేందర్, పాఠశాల హెడ్మాస్టర్ టి.అరుణ, మెడికల్ ఆఫీసర్ పిహెచ్ సి రాఘవపూర్ డాక్టర్ మమత, ఎమ్ ఎల్ హెచ్ పి పెద్దపల్లి డాక్టర్ కీర్తన, ఏఎన్ఎం పి.సునీత, ఆశ వర్కర్
ఎ.జ్యోతి, సంబంధిత అధికారులు,
విద్యార్థులు, తదితరులు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App