
AIYF State Conference : డిండి (గుండ్లపల్లి) ఆగష్టు 25, త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర అఖిలభారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని డిండి మండల సిపిఐ ప్రజాభవన్ లో అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) డిండి మండల అధ్యక్ష కార్యదర్శులు కాంపల్లి ప్రవీణ్,ఎలిమినేటి నరేష్ చేతుల మీదుగా అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్,కరపత్రాన్ని విడుదల చేశారు.వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 8 9 10 తేదీల్లో యాదగిరిగుట్టలో జరిగే అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని మండలంలోని యువకులంతా ఈ మహాసభను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇచ్చిన హామీని అమలు చేయకుండా దేశానికి రక్షణగా ఉండే ఆర్మీ ఉద్యోగాలను కూడా అగ్నిపత్ అనే పేరుతో కాంట్రాక్ట్ వ్యవస్థని తీసుకొచ్చిన దౌర్భాగ్యం ఈ కేంద్ర ప్రభుత్వానీకె దక్కుతుంది, దేశాన్నీ కార్పొరేట్లకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తుందని,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ దేశాన్ని దివాలా తీసేల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే భవిష్యత్తులో యువత జీవితాలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.
ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే హామీలే తప్ప అమలుకు నోచుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే భవిష్యత్తులో యువతను చైతన్యం చేసి పోరాటాలకు సిద్ధమవుతామని వారన్నారు.డిండి మండల అభివృద్ధి కోసం నిత్యం పోరాటం చేస్తామని యువత మాతో కలిసి పోరాటాలలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం.ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) డిండి మండల ఉపాధ్యక్షులు నూనెభూపాల్,రాజు,అరున్, నవాజ్,సురేష్,స్టివెన్ తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe