హమాలి వర్కర్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు డిమాండ్
హన్మకొండ జిల్లా
08 డిసెంబర్ 2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హమాలి ప్రధమ మహా సభను ఏఐటియుసి హనుమకొండ జిల్లా కార్యాలయంలో బాల సముద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేల్పుల సారంగపాణి అధ్యక్షత వహించారు ఖమ్మం జిల్లా సిపిఐ కార్యదర్శి పోటు ప్రసాద్ ,బాలమల్లేశం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తరఫున సంతాప సభను బత్తిని సదానందం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు విచ్చేసి మాట్లాడుతూ ప్రభుత్వం హామాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, వంద కార్మికులను నివారించి స్థానికులకులకు పని కల్పిటనే వరకు హమాలీ బ్రతుకులు మారుటకై నిరంతరం ఏఐటియుసిలో చేరికలు జరిగాయిలు ఏర్పాటు చేయాలి, ఆధార్ కార్డు లాగ హామాలీలకు గుర్తింపు కార్డు ప్రభుత్వం ఇవ్వాలి,10 సంత్సరాలు నిండిన ప్రతి కార్మికులకు రూ.10,000/- పెన్షన్ ఇవ్వాలి, ప్రమాదవశాత్తు హమాలీలు చనీపోతే రూపాయలు 20,000/- ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి, దహన సంస్కారాలకై సంక్షేమ బోర్డు ద్వారా రూ. 100000/-లు ఇవ్వాలి, అంగ వికలాంగులు అయితే 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలి, హామాలీ కార్మికులకు ఇంటి స్థలం 62 గజాలు ఇవ్వాలి, ఇండ్లు, డబుల్ బ్రెడ్ రూమ్ లు కట్టి ఇవ్వాలి, హమాలి కార్మికులకు పి.ఎఫ్, ఈ.ఎస్.ఐ. సౌకర్యం,హెల్త్ కార్డులు ఇవ్వాలి, హమాలిలకు ప్రభుత్వ సచ్సిడీల క్రింద ఉపాధి కల్పించాలి పై సమస్యలను త్వరలో ప్రభుత్వం చొరవ చేసుకొని పరిష్కరించాలని మహాసభలో డిమాండ్ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు శ్రీనివాస్ , ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు వేల్పుల సారంగపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి
జక్కు రాజు గౌడ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మల మూర్తి, సహాయ కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా , ఉపాధ్యక్షులు శ్రీనివాస్ , సహాయ కార్యదర్శి బత్తిని సదానందం, లంక దాసరి అశోక్, ఇల్లందుల రాములు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో హమాలి వర్కర్స్ సుమారు 200 మంది హాజరైనారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App