ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
administration functioning well

Administration : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూ లై 09 ; ఉండి నియోజకవర్గం, మండలం, ఉప్పలూరు గ్రామ కార్యదర్శి దారపరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం, భాష , పార్టీ బేధం లేకుండా సూపర్ సిక్స్ పథకాలు అందాయని అన్నారు.

ఆ పంచాయతీలో ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారో తెలిపారు. డ్రైనేజీ, సిసి రోడ్లు , త్రాగునీరు, వీధి దీపాలు మొదలైనవి బాగానే ఉన్నాయని వివరణ అందించారు. పి – నాలుగు, ఇంటి పన్ను, జన గణన సర్ సర్వే ఎంత శాతం పూర్తి అయ్యిందో వెల్లడించారు.ఆ పంచాయతీకీ నిధులు ఎన్ని వచ్చాయో వివరించారు. వాటిని సిసి రోడ్లు మరియు గ్రామాల అభివృద్ధి కోసం ఉపయోగించమని తెలిపారు. అయితే కొత్త పెన్షన్లు, ఇళ్ళు, అడుగుతున్నారని చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page