
Alliance Government : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూ లై 09 ; ఉంగుటూరు నియోజకవర్గం, మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ముప్పర్తిపాడు, వెంకటరాజు పురం, ఆ గ్రామాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అల్లు బద్రి నారాయణ, పి శ్రీనివాస్, మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం, భాష , పార్టీ బేధం లేకుండా సూపర్ సిక్స్ పథకాలు అందాయని అన్నారు. ఆ పంచాయతీలో ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారో తెలిపారు. అయితే ముప్పర్తి గ్రామంలో డ్రైనేజీ, సిసి రోడ్లు సమస్య ఉందని, ఆర్ మరియు బి రోడ్డు కూడా సమస్య ఉందని ఆ పార్టీ అధ్యక్షులు తెలిపారు. వీధి దీపాలు, త్రాగునీరు సంబంధించి మొదలైనవి బాగానే ఉన్నాయని వివరణ అందించారు.
వెంకటరాజు పురం గ్రామంలో మాత్రం త్రాగునీరు ఎద్దడి ఉందని ఆ గ్రామ అధ్యక్షులు తెలియజేశారు. నిరుపేదలకు ఇళ్ళు, కొత్త పెన్షన్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. ఎప్పుడు జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి తిరుగు లేదని ప్రజలు అంటున్నారని సూచించారు.
పి – నాలుగు, ఇంటి పన్ను, జన గణన సర్ సర్వే ఎంత శాతం పూర్తి అయ్యిందో వెల్లడించారు. శాసనసభ్యులు ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుండి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక కార్యకర్తల పని చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను ఎంతమందికి పంపిణీ చేశారో కూడా తెలిపారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని వాళ్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఆయా పంచాయతీలకు నిధులు ఎన్ని వచ్చాయో వివరించారు. వాటిని సిసి రోడ్లు మరియు గ్రామాల అభివృద్ధి కోసం ఉపయోగించమని అన్నారు. మే నెలలో జరిగినటువంటి మహానాడు ఒక పండుగల జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఆ గ్రామాలలో కూటమి సమన్వయం గా పనిచేయడం లేదని అన్నారు. చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం
ఈ రాష్ట్రంలో మరియు వేరే రాష్ట్రాలలో కి వెళ్లే బదులు అందరూ కాకపోయినా కొంతమంది అయినా వ్యవసాయ రంగంలో ఉండి ఆ రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, తదితర ఉద్యోగులుగా కాకుండా ఒక రైతుగా మారితే గ్రామం నుండి, దేశ స్థాయి వరకు మనిషికి ఆహారం అనేది ఎతకకుండా దొరుకుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆకాంక్షించారు. దేశానికి వెన్నుముక్క రైతే అని గుర్తు చేశారు. వంటగ్యాస్ కు సంబంధించి కూటమి నాయకులకు, ప్రతి ఒక్క కార్యకర్తకు ఆ గ్రామాలలో అసలు ఎవరెవరికి అందుతున్నాయా అనేది తప్పనిసరిగా తెలియాలి అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe