Scorching Heat : ఆదిలాబాద్ లో భగ భగ మండుతున్న ఎండలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : Mar 12, 2026, ఆదిలాబాద్ జిల్లాలో వేసవి ఆరంభంలోనే భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలోనే 38.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండుతుండడంతో బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా ప్రధాన రహదారులు జన సంచారం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఏసీలు, కూలర్లు, చల్లని పానీయాలను ఆశ్రయిస్తున్నారు.

వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. రోజుకు కనీసం 5 లీటర్ల నీరు తాగాలని, కాటన్ దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో జిల్లా ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Adilabad Ice Experience Scorching Heat

You cannot copy content of this page

Scroll to Top