WhatsApp Image 2024 10 25 at 13.37.49
భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు అదనపు కలెక్టర్ శ్యామ్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్
రామగుండం, అక్టోబర్-25: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మండలంలో పెండింగ్ ఉన్న భూ సమస్యల పరిష్కారానికి పొగడ్బందీ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామ్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు.
శుక్రవారం అదనపు కలెక్టర్ శ్యామ్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ రామగుండం మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామ్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ, మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులు వివరాలు తెలుసుకున్న అదనపు కలెక్టర్ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
మీసేవ కేంద్రాలకు ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సకాలంలో వాటిని జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ ఆక్ట్ రికవరీ ఫైల్స్ సమీక్షించిన అదనపు కలెక్టర్ వాటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ తనీఖీల్లో తహసిల్దార్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
