జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 03 at 17.34.08

TRINETHRAM NEWS

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ డి.వేణు

పెద్దపల్లి, ఫిబ్రవరి 03: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన వేముల సతీష్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 409 లో 11 ఎకరాల 7 గుంటల పట్టా భూమి ఉందని, దీనికి ప్రస్తుతం రైతు బంధు రావడం లేదని , రైతు భరోసా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మండల తహసీల్దార్ కు రాస్తూ పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.

శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామంలో ఉన్న నక్కలా ఒర్రె అనే చిన్న నదికి ఇరువైపులా కట్టడాలు జరుగుతున్నాయని, అన్నది ఆక్రమణకు గురవుతుందని , ఐకేపి కోసం సర్వే నెంబర్ 66 లో భూమి చదును చేస్తే ఒక సింగరేణి ఉద్యోగి తన పేరు మీదకు ఎక్కించుకున్నారని, ప్రభుత్వ భూములు కబ్జాకి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా శ్రీరాంపూర్ తహసిల్దార్, ఏడి ల్యాండ్ సర్వేలకు రాస్తూ చర్యలు చేపట్టాలని అధినేత కలెక్టర్ తెలిపారు.

రామగిరి మండలం వకీల్ పల్లె గ్రామానికి చెందిన స్వప్న తన భర్త దివ్యాంగుడైనందున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా హౌసింగ్ విభాగానికి రాస్తూ అర్హత మేరకు మంజూరుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నా

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

applications of Prajavani

You cannot copy content of this page