Tamannaah Bhatia :మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా భాటియా

TRINETHRAM NEWS

Trinethram News : మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం కేసులో నటి తమన్నా భాటియాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. తన తల్లితో కలిసి గువాహటి ఈడీ కార్యాలయానికి చేరుకున్న తమన్నా ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వందల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ యాప్‌ ద్వారా ఐపీఎల్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ నిర్వహించారు. సామాన్యులను ఆకర్షించేందుకు సినీతారలతో ప్రమోట్‌ చేయించారు. ఇందుకోసం నిర్వాహకులు భారీగా ఖర్చుపెట్టారు.

నకిలీ పత్రాలతో వేల సిమ్‌లు, బ్యాంక్‌ ఖాతాలు తెరిచి బెట్టింగ్‌ల ద్వారా వచ్చిన డబ్బును హవాలా, క్రిప్టో మార్గాల్లో విదేశాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.మొత్తం 17 మంది బాలీవుడ్‌ ప్రముఖులపై 2023 సెప్టెంబర్‌ నుంచి అధికారుల నిఘా కొనసాగుతోంది. ఈ కేసులో నటుడు సాహిల్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేసినారు !

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top