TRINETHRAM NEWS

రికార్డుల్లో ఉన్నవారు పనిలో ఉండరు, పనిచేసే వారి పేర్లు రికార్డుల్లో ఉండవు. కాంట్రాక్టర్ తో కుమ్మక్కై సంతకాలు పెడుతున్న డిపో మేనేజర్ పై చర్యలు తీసుకోవాలి
వేల్పుల కుమారస్వామి,సీఐటీయు జిల్లా అధ్యక్షులు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని బస్ స్టాండ్ లో ఉన్న సులబ్ (మరుగు దొడ్లు) లో ముగ్గురు కార్మికులు అనేక సంవత్సరాల నుండి పనులు చేస్తున్నారు. కానీ వీరి పేర్లు మాత్రం రికార్డుల్లో లేవు. వీరికి నెలకు 6 వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఎలాంటి చట్టబద్ద హక్కులు, సౌకర్యాలు కల్పించడం లేదు.
పైగా వీరిపై ఆర్.టి.సి. అధికారులు, సిబ్బంది అందరూ పెత్తనం చెలయిస్తున్నారు.
వారు చెప్పినట్లు వినకుంటే పనుల్లోంచి తీసేస్తానని బిదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదెక్కడి న్యాయం అంటే మేము ఇలాగే చేస్తాం మీ దిక్కు ఉన్న చోట చెప్పుకోండి అంటు మానసికంగా డిపో మేనేజర్ వేదింపులకు గురిచేస్తున్నారు.
కానీ నిజానికి అక్కడ పనులు నిర్వహిస్తున్న వారి పేర్లు మాత్రం రికార్డుల్లో లేవు. రికార్డుల్లో ఉన్నవారు పని చేస్తున్నారో, లేదో డిపో మేనేజర్ కు అవసరం లేదు. పని చేస్తున్న వారు ఎవరైనా తనకు సంబంధం లేదు. కాంట్రాక్టర్ నుండి తనకు వచ్చే మామూళ్లు
నెల నెల వస్తె సరిపోతుందని డిపో మేనేజర్ వ్యవహరిస్తున్నారు. పని చేస్తున్న కార్మికులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని సీఐటీయూ గా డిమాండ్ చేస్తున్నాము.
పని చేసే వారి పేర్లు ఎందుకు రికార్డుల్లో నమోదు చేయడం లేదు. ఇతరుల పేర్లు మీద పనిచేయిస్తు వారికి వచ్చే వేతనాల్లోంచి 6 వేలు మాత్రమే ఇచ్చి అసలు పనిచేయని వారికి కొంత, డిపో మేనేజర్ కు కొంత కాంట్రాక్టర్ కు కొంత మామూళ్లు పంచుకుంటూ ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా ఆర్ధిక దోపిడీకి సహకరిస్తున్న గోదావరిఖని బస్ డిపో మేనేజర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App