
బస్సు ఎక్కే క్రమంలో… సీట్ల కోసం తోపులాట, బస్సు టైర్ క్రింద పడి టిడిపి నేతకు తీవ్ర గాయాలు,
అదనపు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు,
స్త్రీ శక్తి ఫథకం అమలు తో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు… అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ ప్రయాణికుల నుంచి విమర్శలు.
Accident RTC Bus Stand : త్రినేత్రం న్యూస్ : వినుకొండ :- పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో మంగళవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బొల్లాపల్లి మండలం టిడిపి సీనియర్ నేత, ఎస్సీ సెల్ నాయకుడు దాసరి కోటేశ్వరరావు కు తీవ్ర గాయాలయ్యాయి.
ఒంగోలు వెళ్లెందుకు బస్టాండ్ కు వచ్చిన కోటేశ్వరరావు కు బస్సు ఎక్కె క్రమంలో సీట్ల కోసం ప్రయాణికుల మధ్య తోపులాటలో బస్సు టైర్ క్రింద పడి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం అమలు ద్వారా మహిళలకు ఆర్టీసీబస్సులో ఉచిత ప్రయాణంను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
పథకం అమలు పరిచిన ప్రభుత్వం, ప్రయాణికుల అవసరానికి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు, మరో పక్క ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు రూట్లలో ఒక్కోక్క బస్సు లో 50 మంది కెపాసిటీ కి , 100 మంది ఎక్కుతున్నారు. దీంతో ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో చెయి ఎత్తు బస్సు ఎక్కు అన్న కోటేషన్… నేడు చేయి ఎత్తినా బస్సులు ఆగని పరిస్థితి కి దాపురించిందని ప్రయాణికులు, మహిళలు విమర్శిస్తున్నారు… ఫథకం అమలు పరిచి సంవత్సరం అవుతున్నా ప్రయాణికులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదని మహిళ నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
స్త్రీ శక్తి పథకం అమలు నుంచి, వినుకొండ డిపోలో బస్సుల్లో సీట్ల కోసం తోపులాటలు జరిగి బస్సు కింద పడి, బస్సులు ఢీ కొని ప్రమాదాలు జరిగి పలువురు మహిళలు, చిన్నారులు, వృద్ధులు, ప్రయాణికులు గాయపడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి… దీనికి తోడు ప్రమాదం సంభవించిందని డ్రైవర్ల పై కేసులు నమోదు చేసిన సంఘటనలు నెల కున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe