
Sujatha Salman : అరకులోయ, అక్టోబర్ 6,(త్రినేత్రం న్యూస్) : ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో పూర్తి విశ్వాసం నెలకొల్పేందుకు ఎన్నికల సంఘం పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, సామాజిక కార్యకర్త సుజాత సల్మాన్ కోరారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల నిర్వహణపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నలు, అభ్యంతరాలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఓటర్ల జాబితా సవరణలు, పేర్ల తొలగింపు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు సంబంధించి ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా అన్యాయంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదన్నారుఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండటం ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరమని సుజాత సల్మాన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమైనప్పుడు వాటిని నివృత్తి చేయడంతో పాటు, సంబంధిత వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి గిరిజన ప్రాంతాల్లో ఓటర్ల జాబితా విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఓటర్ల జాబితాలకు సంబంధించిన ఫిర్యాదులను పారదర్శకంగా పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకత, జవాబుదారీతనం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సుజాత సల్మాన్ అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe