ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం బారత రాజ్య్యంగము దినోత్సవం సందర్బంగా ఓటరు అవగాహన్ కార్యక్రమంలో బాగంగా పట్టణం లో ఎన్నె పల్లి చౌరస్తా నుండి ఎన్ టి ఆర్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన 2కే రన్ ను అదనపు కలెక్టర్ సుదీర్ , అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహరతి తో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ సమ్మరి రివిజన్ 2025 లో బాగంగా ఓటరు అవగానః కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఓటు హక్కు ఆయుధం లాంటిదని, అయుదాన్ని మన చేతుల్లో తీసుకోవాలంటే తప్పని సరిగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కని అన్నారు ఇందుకు గాను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఏం ఆర్ ఓ , బి ఎల్ ఓ ల దగ్గర, ఆన్లైన్ ద్వారా ఓటు హక్కునమోదుచేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. మీ ఇంటిలో గాని , పక్క ఇంటిలో ఎవరైనా అన్నాతమ్ముళ్ళు , అక్కా చెల్లెలు ఎవరు ఉన్నా వారికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్ జాబితాలో నమోదు చేయించాలని అన్నారు.
జిల్లా ఎస్ పి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఓటు అమూల్యమైనదని,18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులు ఓటు హక్కు పై అవగాహనా కలిపించుకొని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించు కొని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ‘భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన – వీటి స్వాతంత్య్రమును, అంతస్తులోనూ, అవకాశంలోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, అందరిలోనూ వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని’ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమములో స్వీప్ నోడల్ అధికారి ఏం.ఎ సత్తార్ , డి ఎస్ పిశ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు , వివిధ శాఖల ఉద్యోగులు , అన్ని కళాశాల ల , విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App