త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) నియోజకవర్గ ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, నల్లగొండ పంచాయతీకి చెందిన, మారుమూల గ్రామ మైన వై. ఎన్. పాకలు గ్రామానికి చెందిన సెగ్గె తేజస్ రామాంజనేయ స్వరూప్ ఎన్ఐటి లో సీటు సాధించాడు. ఇటీవల వెలువడిన జేఈ ఈ మెయిన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్వరూప్ కు మిజోరం ఎన్ఐటి లో మెకానికల్ లో సీటు లభించిందని, స్వరూప్ తండ్రి సతీష్ మరియు కుటుంబ సభ్యులు తెలిపారు.
మారుమూల గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి ఎన్ఐటి లో సీటు సంపాదించడం పట్ల గ్రామస్తులు, పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, స్వరూప్ ను అభినందించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు. అలాగునే గ్రామస్తులు, కుటుంబీకులు, తేజ తోటి స్నేహితులు మన గ్రామానికి మంచి పేరు తేవటమే కాకుండా, చదువుకునే విద్యార్థులకు ఆదర్శ ప్రాయంగా నిలిచావని ఆశీర్వదించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


