
విజయవంతంగా సాగుతున్న ప్రజా పాలన కళా యాత్ర
*రెండు బృందాలుగా ఏర్పడి 108 ప్రాంతాలలో కార్యక్రమాల పూర్తి
*ప్రతి బృందం రోజుకు 3 గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
పెద్దపల్లి, డిసెంబర్ -06: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే ప్రజా పాలన కళా యాత్ర విజయవంతంగా సాగుతుంది.
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నవంబర్ 19 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతి రోజు 3 గ్రామాలలో పర్యటిస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, రైతు భరోసా, రైతు రుణమాఫీ యువతకు ఉపాధి అవకాశాలు, స్కిల్ యూనివర్సిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇందిరా మహిళా శక్తి , 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా, 500 రూపాయల బోనస్ వంటి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలోని ప్రతి మండల కేంద్రం మేజర్ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లను కవర్ చేసేలా జిల్లాలో ఉన్న 20 తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను రెండు బృందాలుగా విభజించి ప్రతి బృందం రోజుకు మూడు ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు చేసేలా కార్యాచరణ రూపొందించడం జరిగింది.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవంబర్ 19న ప్రారంభమైన ప్రజాపాలన కళా యాత్ర కార్యక్రమం డిసెంబర్ 7 వరకు జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు ఎలిగేడు ,రామగిరి, జూలపల్లి ,సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, పెద్దపల్లి, మంథని ముత్తారం, కమాన్ పూర్, మంథని, పాలకుర్తి, అంతర్గం , ధర్మారం మండలాల్లో, పెద్దపల్లి మున్సిపాలిటీ, మంథని మున్సిపాలిటీ రామగుండం కార్పొరేషన్ , సుల్తానాబాద్ మున్సిపాలిటీ ప్రజా పాలన కళా యాత్ర పూర్తి చేసుకుంది.
జిల్లాలో ఇప్పటి వరకు ప్రజాపాలన కళా యాత్ర తెలంగాణ సాంస్కృతిక సారధి రెండు బృందాల ద్వారా 108 ప్రాంతాలలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజా ప్రభుత్వం లక్ష్యాలు, రైతు బాగు కోసం తీసుకుంటున్న చర్యలు, మహిళలను కోటీశ్వరుల్ని చేసే దిశగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి వంటి కార్యక్రమాల గురించి అవగాహన కల్పిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
