Collector Koya : రామగుండం కార్పొరేషన్ పని తీరు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన

TRINETHRAM NEWS

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి,జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

రామగుండం ఆగస్టు 30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నగరంలో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు శనివారం రామగుండం మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేషన్ పని తీరు పై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, నగరంలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా చేపట్టాలని అన్నారు. రోడ్ల పై చెత్త ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, చెత్త సేకరణ సరైన షెడ్యూల్ ప్రకారం జరగాలని అన్నారు దోమల నియంత్రణ కోసం ప్రతి రోజు రామగుండం నగరంలో ఫాగింగ్ తప్పనిసరిగా చేయాలని, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో ఎక్కువ సార్లు ఫాగింగ్ చేయాలని అన్నారు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
నగరంలో అవసరమైన చోట రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు అనంతరం రాజ్య లక్ష్మి కాలనీలోని హస్టల్స్ ను, ఓల్డ్ పంప్ హౌస్ రోడ్ ఏరియా లను పరిశీలించిన కలెక్టర్ వరదల వల్ల ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని అన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A review was conducted with the concerned officials

You cannot copy content of this page

Scroll to Top