దేవరకొండ ఆగష్టు 22 త్రినేత్రం న్యూస్. స్థానిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం దేవరకొండ కార్యదర్శి అంకం చంద్రమౌళి రిటైర్డ్ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వృక్షో రక్షిత రక్షిత: అనే సూక్తిని పాటిస్తూ వాతావరణ కాలుష్యం జరుగకుండా గత 13 సంవత్సరాలనుండి తన ఇంటి ఆవరణలో, ఇంటి చుట్టూ కానుగు, వేప, గన్నేరు, ఉసిరి, పారిజాతం,మామిడి, తిప్ప తీగ, శంకు, కరివేపాకు, మందారం, తులసి, నూరు వరహాలు, బొడ్డు మల్లె, పచ్చపూలు, కలమంద మొదలగు 20 రకాల చెట్లు, మొక్కలు నాటి వాటిని కుటుంబ సభ్యులతో కలిసి పరిరక్షణ చేస్తున్నారు.
వారిని పలుకరించగ నాకు చిన్నప్పటి నుండి మొక్కలంటే చాలా ఇష్టం అన్నారు. మరియు తాను పనిచేసిన పాఠశాలలో కూడ సిబ్బంది సహకారంతో చెట్లు నాటి పరిరక్షించే వాడిని అన్నారు. నిజమే వారి ఇంటి పరిసరాలను పరిశీలిస్తే నిజంగా మనము ఊరిలో వున్నామా అడివిలో వున్నామా, తోటలో వున్నామా అనిపిస్తుంది.తమ పెన్షనర్స్ భవనంలో కూడ మొక్కలు నాటి పరిరక్షణ చేస్తున్నారు. మొక్కలను, చెట్లను నాటి వాటిని మనము కాపాడి పరిరక్షిస్తే అవి మనకు అక్షిజన్(ప్రాణ వాయువు) అందించి మనలను కాపాడుతాయి అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


