IMG 20240904 WA0026
A peace meeting to celebrate 5 days of Vinayaka Utsyaval with the unity of Muslims, Christians and Hindu brothers
Trinethram News : వికారాబాద్ జిల్లా తాండూర్ (త్రి నేత్రం న్యూస్)బుధవారం హైదరాబాద్ రోడ్డు ,దుర్గాభవాని హోటల్ పంక్టన్ హాల్ యందు తాండూర్ పట్టణంలో 5 రోజుల వినాయక ఉత్సవాల కొరకు పోలీస్ సభ డివిజన్ శాఖవారు శాంతి సమావేశం నిర్వహించారు.ఇట్టి సమావేశానికి పట్టణం లో ఉన్న హిందూ ముస్లీం మత పెద్దలు,ముస్లీం సంఘం నాయకులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,స్థానిక డీఎస్పీభాలకృష్ణారెడ్డి,పట్టణ సీఐ సంతోషు కుమార్ ,ముఖ్య అతిథిగా ఎస్పీ నారాయణరెడ్డి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్మునల్ అని అనుకున్న తాండూరులో ఇంత శాంతియుతంగా,అన్నిమతాల పండుగలు ,జరుపుకోవడం ఎంతోసంతోషం అనిపిస్తుందన్నారు.ఈ సందర్భంగా హిందూ ఉత్సవకమిటీ ఎస్పీ తో పాటు డిపార్టుమెంటు మరియు అధికారులను,వారందరినీ శాలువాలతో సన్మానం చేశారు.
ఎక్సైజ్ సిఐ,మున్సిపల్ కమీషనర్ ,తాండూర్ తహశీల్దార్,ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏ డీ,డివిజన్ లో అన్ని పోలీస్ స్టేషన్ల ఏస్ ఐ లు,ముఖ్యంగా హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షు రాలు మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ,గౌరవ అధ్యక్షులు రాజ్ గౌడ్,ప్రధాన కార్య దర్శి పట్లోల్ల నర్సింలు,ముస్తాప పటేల్,కమలత్తర్, భాను ప్రసాద్,మున్సిపల్ కౌన్సిలర్స్,తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
