WhatsApp Image 2024 03 28 at 07.33.00
Trinethram News : Mar 28, 2024,
బిస్కెట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిషనరీ, బిస్కెట్ తయారీ ముడి సరుకు పూర్తిగా కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
