TRINETHRAM NEWS

ఆనంతో కోటంరెడ్డి కీలక భేటీ..

Trinethram News : నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘ చర్చలు నిర్వహించారు..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టీడీపీ గెలుపునకు వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చేసేందుకు ప్రణాళికలు రచించారని సమాచారం. సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ప్రణాళిక అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది. ఆనం, కోటంరెడ్డి భేటీతో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్‌ చోటు చేసుకుంది..