త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. అశ్వారావుపేట మండలంలో ఆదివాసి హక్కుల కోసం ఈనెల 21వ తారీకు ఆదివారం అశ్వారావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం తెలిపింది. ఈ ర్యాలీలో నాయక పోడు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సోమాని శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి తాళ్ల దుర్గయ్య పిలుపునిచ్చారు. ఈ మహోద్యమంలో ఆదివాసి ఇతర తెగలతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారు కోరారు. మన హక్కుల కోసం మనము అందరము కలిసి పోరాడాలని పోరాడితే పోయేదేమీ లేదని ఇది మన అందరి బాధ్యత అని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవా సంఘం నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


