లక్ష డబ్బులు వెయ్యి గొంతుల భారీ ప్రదర్శన కు సంగీభవం తెలుపుతూ సినీ గేయ రచయిత, ప్రజా కవి మిట్టపల్లి సురేందర్ ఆధ్వర్యంలో భారీ రైలీ
జనవరి 19(త్రినేత్రం న్యూస్ )ధర్మసాగర్
ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7న చేపట్టిన హైదరాబాదులో చేపట్టిన లక్ష డప్పులు వేయి గొంతుల భారీ ప్రదర్శన, మహాసభ విజయవంతం చేయాలని ప్రజా కవి రచయిత మిట్టపల్లి సురేందర్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్ కాసిపేట లింగయ్య కోరారు. SC వర్గీకరణ అమలు కోసం మందకృష్ణ మాదిగ
జనవరి 20నహన్మకొండ లోని వెయ్యి స్తంబాల గుడి నుండి జరిగే సంఘీభావ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ముందస్తుగా ధర్మసాగర్ లో మాదిగ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం డప్పు కళాకారుల ప్రదర్శనతో భారీ రైలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రజా కవి రచయిత మిట్టపల్లి సురేందర్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, కాజీపేట లింగన్న మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు .వర్గీకరణ చివరి దశకు చేరుకోవడం జరిగిందని అన్నారు. న్యాయమైన ఎస్సీ వర్గీకరణ కోసం ఈ రోజున మందకృష్ణ చేపట్టిన ఉద్యమానికి అన్ని కులాలు వివిధ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు. వర్గీకరణ అమలు కోసం హైదరాబాదులో జరుగు లక్ష డప్పులు వేయి గొంతుల వారి బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఇంటి నుండి హైదరాబాద్ తరలివచ్చి మన నినాదాన్ని వినిపించాలని కోరారు దానిని విజయవంతం చేయడంలో భాగంగా అన్ని వర్గాల సంఘీభావ రాలి నేడు జనవరి 20నహన్మకొండ లోని వెయ్యి స్తంబాల గుడి నుండి నక్కల గుట్ట వరకు ఉందన్నారు. దీనిని విజయవంతం చేయడానికి మాదిగ జర్నలిస్టుల ఫోరంఆధ్వర్యంలో భారీ ప్రదర్శనచేయడం జరిగింది. కార్యక్రమంలో వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, జర్నలిస్టులు కొట్టే శ్రీనివాస్ కొట్టే లెనిన్ సుధాకర్ బొడ్డు కరియప్ప పప్పుల్ కుమార్ ,బొల్లెపాక రాజేష్ విజయ్ ఇమ్మడి సునీల్ కొట్టె చార్లెస్ కర్ర రాజేశ్వర్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట బిక్షపతి గంగారం శ్రీనివాస్ బొడ్డు శాంతి సాగర్ గుర్రపు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమ్మ వేణు బీసీ సంఘాల నాయకులు బొడ్డు ప్రభుదాస్ టిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు నిమ్మ సుదర్శన్ రెడ్డి బిజెపి జిల్లా నాయకులుబొడ్డు కుమార్ టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, బొడ్డు వాసుదేవ్ ఎక్స్ జెడ్పిటిసి ,కూనూరు రాజు ఎక్స్ సర్పంచ్,కొలిపాక రమేష్ ఎక్స్ సర్పంచ్ ,రొండి రాజు ఎక్స్ ఎన్ పి టి సి,బొడ్డు ఇమ్మన్ బి ఆర్ ఎస్ మండల నాయకులు, బొడ్డు ప్రతాప్ టిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, బొడ్డు ప్రభుదేవ్ బి ఆర్ ఎస్ మండల యూత్ నాయకులు, సోంపల్లి అన్వేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ,సింగారపు పవన్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి,మాచర్ల బాబు మాదిగ వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు తదితరులు, పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App