
తేదీ : 17/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, తాడిగూడెం గ్రామంలో ఘనంగా బైబిల్ మిషన్ సభ జరిగింది. ఈ సభకు వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ జాన్ మరియు దేవదాసు పాల్గొన్నారు. లెంట్ డేస్ జరుగుతున్నందున ఏసుప్రభు పడినటువంటి శ్రమ, ఉపవాస ప్రార్థనలు, బైబుల్లోని వాక్యాన్ని సభకు అధిక సంఖ్యలో వచ్చినటువంటి విశ్వాసులకు వివరించడం జరిగింది.
సంఘం కాపరి రెవరెండ్ మరియు పి. పాల్ సభ్యులు ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా భోజన సదుపాయం కల్పించారు. వచ్చిన విశ్వాసులందరికీ ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
