సూర్యాపేట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దాబాలో యువకులు మధ్య ఘర్షణ జరిగింది

TRINETHRAM NEWS

ఖమ్మం జిల్లా
ఖమ్మం రూరల్ మండలం సూర్యాపేట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దాబాలో యువకులు మధ్య ఘర్షణ జరిగింది.

బిల్లు చెల్లించే సమయంలో దాబా యజమానికి ఖమ్మం పట్టణానికి చెందిన యువకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో తెల్దారుపల్లి కి చెందిన యువకులు కలుగ జేసుకోవడం తో వారిపై దాడికి దిగారు.

దీంతో తెల్దారు పల్లి యువకులకు గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న రూరల్ ఎస్.ఐ సురేష్ తన సిబ్బంది తో వెళ్లి గాయపడ్డ వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రికి సైతం వెళ్లిన ఖమ్మం పట్టణ యువకులు అక్కడ కూడా దాడికి దిగారు. అడ్డుకోబోయిన ఎస్.ఐ కి కూడా గాయాలయ్యాయి.

వెంటనే అక్కడకు టూ టౌన్ పోలీసులు చేరుకుని యువకులను చెదరగొట్టారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకుని ఖమ్మం టూ టౌన్ స్టేషన్ కు తరలించారు.

You cannot copy content of this page

Scroll to Top