జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 14 at 11.41.59

TRINETHRAM NEWS

బస్సు డ్రైవర్, కారు ఓనర్ దుర్మరణం…

తిరుపతి జిల్లా

చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

గిద్దలూరు నుండి చెన్నైకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందుచక్రం పంచరైంది.

బస్సును పక్కకు పార్క్ చేసి బస్సులోని రెండవ డ్రైవర్ మలంగ్షా వలి (52) వెనుక టైరు కింద రాళ్లు పెడుతుండగా తాడేపల్లి గూడెం నుండి చెన్నై ఆస్పత్రికి వెళుతున్న కారు బస్సును ఢీకొంది.

దీంతో బస్సు డ్రైవర్ మలన్షా వలి, కారులో ఉన్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

కారులో ఉన్న మృతుని భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి.

చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

You cannot copy content of this page