WhatsApp Image 2024 01 26 at 4.44.03 AM
Trinethram News : హైదరాబాద్: తెలంగాణ సచివాలయం సమీపంలో ప్రధాన రహదారిపై గురువారం రాత్రి కారు దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్నవారు వెంటనే కిందకు దిగి, విలువైన వస్తువులను బయటకు తీశారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
