
MLA : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo. పెనుమూరు ( త్రినేత్రం న్యూస్)జూన్ 15. గంగాధర్ నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రం శ్రీ పులిగుంటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగాంద్ర కార్యక్రమo నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ యోగ ఒక్క రోజులో ముగిసేది కాదని జీవితాంతం ముడిపడి ఉన్న ఓ బృహత్తరమైన ప్రక్రియ అని అన్నారు.
గంగారం నెల్లూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాతోనే మానవాళికి ఆయువు, ఆరోగ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, పెనుమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు, మరియు పెనుమూరు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు ఉపాధ్యాయులు, మండల స్థాయి అధికారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe