Tribal groups Warn Peddhi : ఆదివాసుల గౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకోం “పెద్ది” చిత్ర యూనిట్‌కు గిరిజన సంఘాలు వార్నింగ్

TRINETHRAM NEWS
Tribal groups warn 'Peddhi'

​ Tribal groups warn Peddhi : ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా జూన్ 7, (త్రినేత్రం న్యూస్): ఇటీవల విడుదలైన ‘పెద్ది‘ సినిమాలో ఆదివాసీ (గిరిజన) సమాజాన్ని అవమానించేలా, వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న డైలాగులపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివాదాస్పద డైలాగులను తక్షణమే తొలగించాలని, చిత్ర యూనిట్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు హీరో రామ్ చరణ్, చిత్ర దర్శకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.​ఈ సందర్భంగా గిరిజన సహోదరులు మాట్లాడుతూ ఆదివాసులందరికీ ఒక అవమానకరమైన రోజుగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది సినిమాలో ‘కొండ నా కొడుకా’ (కొండోడు) అంటూ వాడిన పదం యావత్ ఆదివాసీ సమాజాన్ని తీవ్రంగా అవమానించడమే అని గిరిజన సహోదరులు పెద్ది డైరెక్టర్ పై ధ్వజమెత్తారు.
​ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆదివాసులకు ప్రత్యేక చట్టాలు, సమాన హక్కులు కల్పిస్తే, నేటి సినిమా రంగం వాటిని తుంగలో తొక్కుతోంది. గతంలో కూడా రెండు మూడు సినిమాల్లో గిరిజనులను చిన్నచూపు చూస్తూ చూపించారు. తమకు ఎవరితోనూ రాజకీయ విభేదాలు లేవని, తమ ఆవేదన అంతా ఆదివాసుల హక్కులు, గౌరవం గురించేనని ఆయన స్పష్టం చేశారు. వివాదాస్పద పదాలను తక్షణమే తొలగించకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసులంతా కలిసి తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతారని హెచ్చరించారు.​డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి! ​ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సుమారు 32 లక్షల మంది గిరిజనులతో పాటు, దేశంలోని ఆదివాసులందరినీ ఈ సినిమా డైలాగులు తీవ్రంగా గాయపరిచాయని గిరిజన ప్రతినిధులు పేర్కొన్నారు.
​సినిమా రంగం నుండి వచ్చి, ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కి ఈ డైలాగుల గురించిన సమాచారం ఉందా? లేదా ఇలాంటి పదాలను మీరే ప్రోత్సహిస్తున్నారా? గిరిజన బిడ్డలపై నిజంగా ప్రేమాభిమానాలు ఉంటే ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు.​సెన్సార్ బోర్డు నిర్లక్ష్యంపై మండిపాటు ​సెన్సార్ బోర్డు అధికారులు కూడా ఈ విషయంలో బాధ్యత వహించాలని గిరిజన నేతలు కోరారు.

గిరిజనులను అసభ్యకరంగా, తక్కువ చేసి మాట్లాడిన పదజాలాన్ని సినిమా నుండి తక్షణమే తొలగించేలా సెన్సార్ బోర్డు చర్యలు తీసుకోవాలన్నారు.వివాదాస్పద సీన్లు, డైలాగులు తొలగించని పక్షంలో చట్టపరమైన పోరాటంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద దర్శకుడు, హీరో రామ్ చరణ్‌లపై కఠిన చర్యలు తీసుకునే వరకు వెనకడుగు వేసేది లేదని గిరిజన సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సహోదరులు శతక బుల్లి బాబు, వంతల అరుణ్ కుమార్,చట్టు మోహన్, తడబారికి సురేష్ కుమార్, చందా రంజిత్ ,పి. వెంకట్ స్వామి, అశోక్,పి.అశోక్,వెంకీ, గుజ్జెల ప్రసన్న, రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top