
Coalition Government : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ మే 30 : పోలవరం నియోజకవర్గం , వేలేరుపాడు మండలం, మేడిపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సరియం రాజు , సాపర శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం, భాష , పార్టీ బేధం లేకుండా సూపర్ సిక్స్ పథకాలు అందాయని అన్నారు. ఆ పంచాయతీలో ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారో తెలిపారు. వీధి దీపాలు, నీటి సౌకర్యం, మొదలైనవి బాగానే ఉన్నాయని వివరణ అందించారు. నిరుపేదలకు ఇళ్ళు, కొత్త పెన్షన్ లు సమస్య ఉందని ప్రభుత్వం గుర్తించి తక్షణమే వాటిని అమలు పరచాలని కోరారు .
ఎప్పుడు జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి తిరుగు లేదని ప్రజలు అంటున్నారని సూచించారు. అయితే ఆ గ్రామంలో డ్రైనేజీ, సిసి రోడ్లు సమస్య ఉందని తెలిపారు. ప్రభుత్వం గుర్తించి తక్షణమే ఆ సమస్యకు పరిష్కారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు .కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ నుండి నిధులు రాలేదని చెప్పడం జరిగింది.పి – నాలుగు, ఇంటి పన్ను, జన గణన ఎంత శాతం పూర్తి అయ్యిందో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను ఎంతమందికి ఇచ్చారో చెప్పారు.
ఈనెల ఇరవై ఏడు,ఇరువై ఎనిమిది మండలంలో జరిగిన మహానాడు గురించి వివరించారు . ఒక పండుగలా
జరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా టిఫిన్స్, మంచినీరు, భోజనాలు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పించారని , చెప్పడం జరిగింది. కూటమి సమన్వయంగా పనిచేస్తుందని అన్నారు. ఆ పార్టీలోనే వర్గ పోరు విభేదాలు ఉన్నాయని గుర్తు చేశారు. అధిష్టానం కార్యకర్త నాయకుడని అంటుంది గాని, ఆ కార్యకర్తను గుర్తించడం లేదని బాధ ను తెలియపరిచారు. శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి మా ఊరు వచ్చాడే కానీ, గెలిచిన తర్వాత ఇంతవరకు మా ఊరి మొహం చూడలేదని ఆవేదన వ్యక్తపరిచారు.
రెండుసార్లు ఆయనను కలవడానికని తన క్యాంపు కార్యాలయానికి వెళ్తే అర్జెంటు పనిమీద బయటికి వెళ్తున్నాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని , ఎమ్మెల్యేతో మాట్లాడడానికి వీలుపడలేదని పేర్కొన్నారు. అటువంటి వాళ్లను మళ్లీ ప్రజలు గెలిపిస్తారా? అని ప్రశ్నించారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

