జూలై 7, 2026
TRINETHRAM NEWS
MP Provided Financial Assistance

MP Provided Financial Assistance : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 16: జిల్లా : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నూజివీడు మండలం, పొలసానిపల్లి గ్రామానికి చెందిన ఇరవై ఐదు సంవత్సరాల స్వాతి అనే యువతి  తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోంది. గత కొంతకాలంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు.

ఈ పరిస్థితుల్లో తల్లీ తండ్రి లేని  ఆమె, తన పెదనాన్నను తోడుగా తీసుకుని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన నివాసంలో కలిసి తన ఆరోగ్య, ఆర్ధిక పరిస్థితులను వివరించడం జరిగింది. తీవ్ర ఆయాసంతో,  మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతూ తన సమస్యను చెబుతున్న ఆమె పరిస్థితిని చూసి ఎంపీ చలించారు. ఆమె ఊపిరితిత్తుల వ్యాధితో శరీరం ఎముకల గూడులా మారడంతో పది ఏళ్ల బాలిక స్థాయికి శరీరం కృశించిపోయింది.

ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన వెంటనే  అప్పటికప్పుడు తక్షణ ఆర్థిక సహాయంగా ఇరవై వేల రూపాయలు అందించడమే కాకుండా ఆమెకి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు  చేయాలని సిబ్బందిని ఆదేశించారు.  కొద్ది సమయం కూడా నిలబడలేకపోతున్న స్వాతి పరిస్థితిని గమనించి, ఒక మూడు చక్రాల వాహనాన్ని కూడా అందిస్తానని హమీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక కేటగిరీ కింద పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండు అని, మెరుగైన వైద్యం చేయించుకోవాలని ఆమెకు సూచించారు.
‎పేదరికం కారణంగా వైద్యం చేయించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఎవరికీ రాకూడదనే ధ్యేయంతో కూటమి ప్రభుత్వం  వైద్య రంగంపై దృష్టి పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు అనేక ఉచిత వైద్య పథకాలు తీసుకువచ్చిందన్నారు. పుట్టా మహేష్ కుమార్. తాను కూడా ఏలూరు సహా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నానని, అధునాతన వైద్య పరికరాలు అందించే ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు.

సహాయం కోసం ఇప్పటి వరకూ ఎంతోమంది నాయకుల వద్దకు వెళ్లినప్పటికీ ఈ విధమైన సహాయం, భరోసా ఎక్కడా లభించలేదని చెబుతూ ఆ యువతి, ఆమె పెదనాన్న ఇద్దరు ఎంపీకి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page