మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన గౌరవ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,కమిషనర్ రామకృష్ణారావు ,గౌరవ ప్రజాప్రతినిధులు,అధికారులు. ఈ సందర్భంగా గౌరవ మేయర్ మాట్లాడుతూ అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛా,స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మహా నాయకుడు గాంధీజీ అని,సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన మన జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు.అదే విధంగా దేశానికి స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి త్యాగానికి గుర్తుగా దేశ వ్యాప్తంగా జనవరి 30న అమరవీరుల దినోత్సవం (షహీద్ దివాస్) గా నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,NMC ఆయా విభాగాల అధికారులు,మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top