
బోరు బావిలో పడి మృతి చెందిన బాలుడు కడమంచి శ్రీను కుటుంబానికి అండగా ఎమ్మెల్యే బలరామకృష్ణ_
MLA Bathula : త్రినేత్రం న్యూస్, రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ఇటివల బోరు బావిలో పడి మృతిచెందిన చిన్నారి కడమంచి శ్రీను కుటుంబానికి ఆనాడు తక్షణ సహాయం కింద తన సొంత నిధులను రూ.1,00,000/- అలాగే ప్రభుత్వం తరపున రూ.2,00,000/- ఇవ్వడం జరిగింది.అలాగే వారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని తమ నుండి అలాగే ప్రభుత్వం తరపున కచ్చితంగా న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది.
ఇచ్చిన మాట ప్రకారం మన గౌ.శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ, ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు లను కలిసి విషయం తెలియచేసి మరల ప్రభుత్వం తరపున ఈరోజున రూ 2,00,000/- చెక్కును వారి ఇంటివద్దకు వచ్చి వారి కుటుంబానికి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వీరితోపాటు జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

