
Road Accident : త్రినేత్రం న్యూస్ : విశాఖ వెస్ట్ పరిధిలోని ఎన్ఏడి కొత్త రోడ్డు ఫ్లైఓవర్ నుంచి కాకాని నగర్ జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద తీవ్రత ఎంతగా ఉందంటే… ఆటోలో ఉన్న ఓ మహిళ లారీ కింద భాగంలో చిక్కుకుపోయింది. స్థానికులు, పోలీసులు కలిసి ఆమెను బయటకు తీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా ఎన్ఏడి కొత్త రోడ్డు ఫ్లైఓవర్ పై భాగం, కింద భాగం రెండింట్లో కూడా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించే చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

