Petrol Price Hiked : పెట్రోల్ పై లీటర్ కు 2 రూపాయలు పెంపు

TRINETHRAM NEWS
Petrol price hiked

Petrol Price Hiked : త్రినేత్రం న్యూస్ : ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు మూడో వారం చివరికి చేరుకున్న వేళ చమురు సెగలు సామాన్యుడి జేబును తాకాయి. మెున్న గ్యాస్ ఇప్పుడేమే పెట్రోల్ రేట్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా బంకుల్లో అమ్మే ప్రీమియం పెట్రోల్ అదే పవర్ పెట్రోల్ పై తాజాగా రేటు పెంచాయి ఆయిల్ కంపెనీలు. యుద్ధం వేళ ఏర్పడిన ప్రతిష్టంభనతో షిప్స్ నట్టనడి సముద్రం మధ్యలోనే ఆగిపోవటంతో పరిస్థితులు దిగజారుతున్నాయి.

ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రైవేటు ఆయిల్ కంపెనీలు దేశవ్యాప్తంగా అమ్ముతున్న పవర్ పెట్రోల్ రేటును లీటరుకు 2 రూపాయల 26 పైసలు పెంచేసాయి. ఆయిల్ కంపెనీని బట్టి రేటు రూ.2.26 నుంచి రూ.2.35 వరకూ పెరిగాయి. దీంతో లీటరు పవర్ పెట్రోల్ ధర రూ.115కి చేరుకుంది. అయితే సాధారణ పెట్రోల్ ధరలు మాత్రం ప్రస్తుతానికి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన కొత్త రేట్లు నేటి అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని డీలర్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే మరోపక్క చాలా చోట్ల పట్టణ శివార్లలో అలాగే చిన్న టౌన్స్ లో పెట్రోల్, డీజిల్ నో స్టాక్ అంటూ బోర్టులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒకపక్క ప్రభుత్వం కావాల్సినంత పెట్రోల్, డీజిల్ మన దగ్గర ఉంది అస్సలు ఫికర్ అక్కర్లేదని చెబుతుంటే వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా మారాయి

యుద్ధం తర్వాత తొలిసారిగా పెట్రోల్ రేట్ల పెంపును చూస్తుంటే రానున్న కొద్ది రోజుల్లోని మిగిలిన సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు అలాగే ఆటో ఎల్పీజీ, సీఎన్జీ ధరలు కూడా పెరగటం స్టార్ట్ అవుతాయని చమురు రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇప్పటికే ఏఐతో జాబ్స్ కోల్పోయి దేవుడా అంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్న టెక్కీల నుంచి అరకొర సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఆందోళనలు పెంచేస్తోంది. ఈ రిపల్ ఎఫెక్ట్ కూరగాయల రేట్ల నుంచి వంట సామాగ్రి, కరెంట్ బిల్లుల వరకూ తాకటానికి పెద్ద ఆలస్యం కాదనేది నిపుణుల మాట

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top