
Journalists be Careful : అరకులోయ మార్చి 18, (త్రినేత్రం న్యూస్): అరకులోయ పట్టణ పరిధిలో ఇటీవల పత్రికల పేరుతో బ్లాక్ మెయిల్ జర్నలిజం ఊపందుకుంది అని ఊహాగానాలు ప్రజల్లో మొదలవుతున్నాయని, వీటిని అరికట్టే విధంగా జర్నలిస్టులు అందరూ సహకరించి నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేయాలని అరకులోయ ఏపీయూ డబ్ల్యూజే సమావేశంలో అధ్యక్షుడు వెంకటేశ్వరరావు సూచించారు. వివరాల్లోకి వెళితే కొంతమంది జర్నలిస్టులు పత్రికల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని అవి తమ దృష్టికి వచ్చాయని ఇకనైనా జర్నలిస్టులు మారకపోతే తగు చర్యలు ఉంటాయని ఏపీ యు డబ్ల్యూజే అధ్యక్షులు వెంకటేశ్వరరావు హెచ్చరించారు.
అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు ఈ తప్పుడు దందా వలన నిజమైన జర్నలిజానికి నష్టం కలుగుతుందని, ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అరికట్టాలని అదేవిధంగా ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్తూ నీతి నిజాయితీ నిబద్ధతతో ప్రతి ఒక్కరు పనిచేయాలని జర్నలిస్టులకు సూచించారు. అదేవిధంగా పత్రిక విలేకరులు బ్లాక్మెయిల్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో అధ్యక్షులు వెంకటేశ్వరరావు అత్యవసర సమావేశం అరకువ్యాలీ మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పరిచారు.
ఈ సమావేశంలో పత్రికా విలేకరుల సంక్షేమం కోసం మాట్లాడుతూ గ్రామీణ విలేకరి నుండి డెస్క్ జర్నలిస్ట్ వరకు వారి ఆరోగ్యం పిల్లలు చదువు వృద్ధాప్యం సొంత ఇల్లు మరణాంతర కుటుంబ స్థితి వంటి సమస్యలపై లోతైన అధ్యయనం అవసరమని ఒక సమగ్ర మ్యానిఫెస్టో తయారు చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు మాదిరిగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయమైయ్యాయని, ఆ విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటి పథకాలు అమలు చేయగలిగితే జర్నలిస్టులకు గొప్ప సంక్షేమం జరుగుతుందని అభిప్రాయపడ్డారు, కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

