
Supreme Court : త్రినేత్రం న్యూస్ : ప్రసూతి సెలవుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దత్తత తీసుకున్న బిడ్డ వయసు మూడు నెలల కంటే తక్కువ ఉంటేనే ప్రసూతి సెలవులకు అర్హత అనేది సరికాదని, దీనికి అనుమతించే సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 60(4) రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చిన్నారి వయసుతో సంబంధం లేకుండా దత్తత తీసుకున్న సమయం నుంచి 12 వారాల పాటు ప్రసూతి సెలవులు తీసుకునేందుకు మహిళలకు అర్హత ఉంటుందని తెలిపింది..
Trinethram news

