MLA Bandaru Satyananda : తెలుగు భాష ఉన్నంతవరకు మొల్లమాంబ కీర్తి నిలిచి ఉంటుంది

TRINETHRAM NEWS

మొల్ల రామాయణం అజరామరం..

మొల్ల జయంతి ఉత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

త్రినేత్రం న్యూస్ : అచ్చ తెలుగులో రామాయణాన్ని రచించి అజరామరమైన కీర్తిని పొందిన మహాకవయిత్రి మొల్లమాంబ ఖ్యాతి తెలుగు భాష ఉన్నంత వరకు నిలిచి ఉంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. శుక్రవారం మొల్లమాంబ జయంతి సందర్భంగా వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి తొలి తెలుగు కవయిత్రిగా మొల్లమాంబ ఎదిగిన తీరు అందరికీ ఆదర్శమన్నారు. మొల్ల రామాయణంలో పద్యాలు సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. మొల్లమాంబ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించడం తెలుగు భాషకే గర్వకారణమన్నారు.

As long as the Telugu language exists

You cannot copy content of this page

Scroll to Top